పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా..? ఉండదా..? అనే అనుమనాలు మొదలయ్యాయి. డౌట్ వచ్చిన ప్రతిసారీ.. ఈ ప్రాజెక్ట్ ఉంటుందని క్లారిటీ ఇస్తునే ఉన్నారు.
ఇదిలా ఉంటే.. పవన్ తో హరీష్ శంకర్ ‘తేరి’ రీమేక్ చేయనున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ కలిసి దీనిపై నిర్ణయం తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు రీమేక్స్ ని సక్సెస్ ఫుల్ గా తెలుగులో తీసిన హరీష్.. తేరి స్టోరీని తన స్టైల్ లోకి మార్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే వినోదయ సితం, తేరి రీమేక్స్ లో పవన్ కళ్యాణ్ ముందుగా దేనిని స్టార్ట్ చేస్తారనేది చూడాలి.
పవన్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలు చూసుకోవాలి కాబట్టి.. రీమేక్ ప్రాజెక్ట్స్ ను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. కానీ ఫ్యాన్స్ మాత్రం వంద కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఇలాంటి రీమేక్స్ చేయడమేంటని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భవదీయుడు భగత్ సింగ్ ఓరిజినల్ స్టోరీ. కనుక ఈ సినిమాని పవన్ చేయాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. మరి.. పవన్ ఓరిజినల్ స్టోరీకి ఓటేస్తారో..? రీమేక్ మూవీకి ఓటేస్తారో..? చూడాలి.