Saturday, June 13, 2026
Homeసినిమా జిన్నాలో ‘జారు మిఠాయి’పాట విడుదల

 జిన్నాలో ‘జారు మిఠాయి’పాట విడుదల

విష్ణు మంచు తాజా సినిమా జిన్నా. డా. మోహన్ బాబు ఆశీస్సులతో AVA ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి మూల కథ అందించగా… కోన వెంకట్ స్క్రీన్ ప్లే రాశారు.  దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే.. విష్ణు మంచు మరియు సన్నీ లియోన్ కలిసి చేసిన మంచి మాస్ మసాలా పాట “జారు మిఠాయి” పాట లిరికల్ వీడియో ను విడుదల చేశారు.

అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా ఎ.గణేష్ లిరిక్స్ రాశారు. సింహ, నిర్మల రాథోడ్ పాటను పాడారు. ఈ రొమాంటిక్ పాటకి ప్రేమ్ రక్షిత్ మాస్టార్ తన మాస్ స్టెప్ లతో పాటకి ప్రాణం పోశారు. ఈ చిత్రం లో పాటలు సరిగమ తెలుగు ఆడియో ద్వారా విడుదలవుతున్నాయి.  ట్రైలర్ కి ఇప్పటికే 3 కోట్ల వ్యూస్ తో మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. విష్ణు మంచు ఈ చిత్రం పై బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read : విష్ణు మంచు ‘జిన్నా’ ట్రైలర్ రిలీజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular