అక్కినేని నాగచైతన్య.. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కృతిశెట్టి కథానాయిక. తెలుగు, తమిళ్ భాషల్లో రోఒపొన్దుతొన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. అయితే.. ఈ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుందని వార్తలు వస్తున్నాయి.
కర్నాటకలోని మాండ్య జిల్లాలోని మేల్కోటి గ్రామంలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ రాయగోపుర దేవాలయం ముందు బార్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారట. ఇది తెలిసిన గ్రామస్థులు నిత్యం పూజలు జరిపే గుడి ముందే బార్ సెట్ వేయడం పై ఫైర్ అయ్యారట. చిత్ర బృందం పై దాడి చేసినట్టు సమాచారం. ఆ సమయంలో హీరో నాగచైతన్య కూడా సెట్ లోనే ఉన్నాడట.
అంతే కాకుండా ఈ మూవీ యూనిట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ ఘటన పై కర్నాటక ప్రభుత్వం నాగచైతన్య, చిత్ర దర్శకనిర్మాతలకు జరిమానా విధించినట్టు తెలిసింది. అయితే.. ఈ చిత్ర యూనిట్ షూటింగ్ కోసం పర్మిషన్ అడగగా పోలీసులు రెండు రోజులు మాత్రమే పర్మిషన్ ఇచ్చారని.. ఈ షూటింగ్ రెండు రోజులు దాటినా కొనసాగించారని టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.
Also Read: రూటు మార్చిన నాగచైతన్య