Thursday, June 11, 2026
Homeసినిమా‘మైఖేల్’టీజర్ అక్టోబర్ 20 న విడుదల

‘మైఖేల్’టీజర్ అక్టోబర్ 20 న విడుదల

వెర్సటైల్ స్టార్ సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. ఈ చిత్రం రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో ప్రత్యేక యాక్షన్ రోల్‌లో కనిపించనున్నారు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు సందీప్ కిషన్. సరికొత్త ట్రాన్స్ ఫర్మేషన్, సిక్స్ ప్యాక్ బాడీ టెర్రిఫిక్ అనిపించింది. ఈరోజు నిర్మాతలు సినిమా టీజర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను అందించారు. ‘మైఖేల్’ టీజర్ అక్టోబర్ 20న విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సందీప్, దివ్యాంశ కౌశిక్ పెదవులపై ముద్దు పెట్టుకోవడం, బ్యాక్ గ్రౌండ్ లో ఎగిరే పక్షులతో పోస్టర్ డిజైన్ చేయడం రొమాంటిక్ గా ఉంది.

సినిమాలో యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా ఉంటుందని ఈ పోస్టర్ తెలియజేస్తోంది. ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సహా నిర్మాణంలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా గా సినిమాగా తెరకెక్కుతున్న మైఖేల్ చిత్రాన్ని నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్ స‌మ‌ర్పణ‌లో భ‌ర‌త్ చౌద‌రి, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Also Read: ‘మైఖేల్’ ఫస్ట్ లుక్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular