కెజియఫ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ పై నిర్మించిన తాజా చిత్రం “కాంతార”. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృస్తిస్తోంది.
థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తోంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. “కాంతార” రిలీజైన మొదటి రోజే 5 కోట్లు గ్రాస్ సాధించింది. ముఖ్యంగా ఈ “కాంతార” క్లైమాక్స్ గురించి చెప్పాలంటే.. అద్భుతం. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడు రిషబ్ శెట్టి. అప్పటి వరకు మాములుగా సాగుతున్న సినిమాను క్లైమాక్స్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు.
థియేటర్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకునికి ఒళ్ళు గగుర్పుడిచేలా ఈ చిత్ర క్లైమాక్స్ ను మలిచాడు రిషబ్ శెట్టి. తనలో ఉన్న దర్శకుడుని నటుడు డామినేట్ చేశాడనేంతలా ప్రేక్షకుడికి మర్చిపోలేని విజువల్ ట్రీట్ ఇచ్చాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు “కాంతార” క్లైమాక్స్ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు. ఇప్పటికే కన్నడలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, తెలుగు లో కూడా అదే మాదిరిగా విజయఢంకాను మోగిస్తుంది.
Also Read : కట్టిపడేసిన ‘కాంతార’ .. వారాహీ దేవి తిరుగాడే ఫారెస్ట్!