Friday, June 12, 2026
HomeTrending Newsఎవరెన్ని చెప్పినా రాజధాని మారదు: కిషన్ రెడ్డి

ఎవరెన్ని చెప్పినా రాజధాని మారదు: కిషన్ రెడ్డి

అమరావతి రాజధానికే భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా రాజధాని మారదని, అమరావతి ఒక్కటే  ఏపీకి రాజధానిగా ఉంటుందని  ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏలూరులో జరిగే పిఎం కిసాన్ సమ్మాన్ కార్యక్రమంలో పాల్గొనటానికి ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చిన కిషన్ రెడ్డికి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో బిజెపి రాష్ట్రాధ్యక్షులు సోమువీర్రా, నేతలు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు/

రాజకీయాల్లో కక్ష సాధింపులుపార్టీ సరికాదని, ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలు చేసేటప్పుడు రెచ్చగొట్టే ధోరణి మంచికాదని కిషన్ రెడ్డి సూచించారు.

Also Read : అమరావతికి అందరూ ఒప్పుకున్నారు: బాబు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular