లండన్ పార్లమెంట్ హౌస్ లో మన తెలుగుఖ్యాతిని చాటుతూ మొట్టమొదటి ఉగాది సంబరాలను నిర్వహించిన మన విజయనగర వాసి రమేష్ ఉడత్తు, హైదరాబాద్ నివాసి శ్రీమతి గౌరి వాలాజా గారు సంయుక్తంగా గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ స్థాపించి చలన చిత్ర రంగం లోకి అడుగుపెట్టారు. ఈ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 1.గా విదార్థ్, ధృవికలను పరిచయం చేస్తూ తెలుగు మరియు తమిళ భాషల్లో ఏక కాలంలో చిత్రీకరించడం జరిగింది, ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జులై 12వ తేదిన ఓ ప్రముఖ వ్యక్తి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా భగత్ సింగ్ నగర్ దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ… నిన్న విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ కు లభించిన స్పందనకు మీడియా మిత్రులకు మరియు సోషల్ మీడియా స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ చిత్రం భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక అందమైన ప్రేమకథ. భగత్ సింగ్ రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాను అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ప్రేక్షకులందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు.