రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్నిదిల్ రాజు నిర్మిస్తున్నారు. చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్, అంజలి, ఎస్.జె. సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. శంకర్ ‘ఇండియన్ 2’ షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేయాల్సి రావడంతో చరణ్ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. దీతో సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే… ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా పై తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాను యూఎస్ లో అన్ని ఇండియన్ భాషల్లో విడుదల చేయడానికి మంచి డిమాండ్ ఉంది. ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను మొదలు పెట్టేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ సినిమా యూఎస్ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ పంపిణీ సంస్థకు అమ్మేసినట్లుగా తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాను యూఎస్ లో పంపిణీ చేసేందుకుగాను దాదాపుగా 17.2 కోట్ల రూపాయలను సదరు సంస్థ దిల్ రాజుకు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుందట. ఆర్ఆర్ఆర్ సినిమా కాకుండా రామ్ చరణ్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఈ స్థాయిలో యూఎస్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదు. దాంతో చరణ్ నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డును నమోదు చేశాడు అంటూ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కూడా నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డును చరణ్ దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి.. చరణ్, శంకర్ కలిసి ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి.
Also Read :జపాన్ లో ఆర్ఆర్ఆర్ త్రయం.