కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్థాయి ఏంటో ఢిల్లీ దూతలే చెప్పారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇద్దరు నేతలవి నకిలీ మాటలు, వెకిలి చేష్టలని విమర్శించారు. వాళ్లు మాట్లాడే మాటలు.. గల్లీ రాజకీయ నాయకులు కూడా మాట్లాడరని చెప్పారు. నోటికొచ్చినట్లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించే విధంగా సభ నిర్వహించామన్నారు. సీఎం కేసీఆర్ సభ ప్రజాభిమానాన్ని చాటిచెప్పిందన్నారు. మునుగోడులో గెలుపు ముమ్మాటికీ ఖాయమైందని చెప్పారు. దశాబ్దాల ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వెల్లడించారు. చండూరులో ఆదివారం నిర్వహించిన సభతో బీజేపీ నాయకులకు కంటిమీద కునుకులేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అబద్ధాలకు బీజేపీ డీఎన్‌ఏగా మారిపోయిందన్నారు.
మునుగోడు ప్రజలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని మంత్రి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయన్నారు. అతి ఎక్కువ రైతుబంధు సాయం పొందిన నియోజకవర్గం మునుగోడని తెలిపారు. నియోజకవర్గంలో 40 వేలకుపైగా ఆసరా పింఛన్లు వస్తున్నాయని చెప్పారు. ఎనిమిదేండ్లలో ఏం చేశామో తాము చూపిస్తామని, మరి బీజేపీ ఏం చేసిందో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచిన ఘనత బీజేపీదేనని విమర్శించారు. బీజేపీ అంటే పెంచుడు.. టీఆర్‌ఎస్ అంటే పంచుడని మంత్రి చెప్పారు.
దయ్యాలు వేదాలు వల్లించినట్టే..
పార్టీలో చేరికల గురించి బీజేపీ మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని ఎద్దేవా చేశారు. వందల కోట్లు ఆశ చూపి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా బీజేపీ ఎత్తుగడలను ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని చెప్పారు. మీరు విలీనం చేసుకోవచ్చుకానీ తాము అదేపని చేస్తే తప్పా అని నిలదీశారు. ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలో చేర్చుకుంటే తప్పులేదా అని ప్రశ్నించారు. మోటర్లకు మీటర్ల పేరుతో..
మోటర్లకు మీటర్లు పెడితే రూ.30 వేల కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వంలో ఆశ చూపిందన్నారు. మీటర్లు పెడితే తక్షణమే రూ.6 వేల కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలంగాణ ఆర్థికశాఖకు లేఖ రాసిందని చెప్పారు. అయితే గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. మోటర్లకు మీటర్ల పేరుతో రైతు మెడలో ఉరితాడు బిగించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది 65 లక్షల మంది రైతుల జీవితాలతో ముడిపడిన అంశమన్నారు.
చేనేతకు జీఎస్టీపై పచ్చి అబద్ధాలు..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. చేనేతపై జీఎస్టీని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందని పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. అయితే జీఎస్టీకి ఒప్పుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. చేనేతపై జీఎస్టీని మినహాయించాలని 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. అప్పటి ఆర్థిక మంత్రి ప్రస్తుతం తమ పక్కనే ఉన్నారని.. ఆయనను అడిగి తెలుసుకోవాలని సూచించారు. బీజేపీ నేతలు అసత్యాలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రూ.19 వేల కోట్లు కాదుకదా..
ఫ్లోరైడ్ కోసం రూ.800 కోట్లు ఇచ్చామని కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని, మిషన్ భగీరథకు రూ.19,200 కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసిందన్నారు. రూ.19 వేల కోట్లు కాదుకదా.. రూ.19 కూడా ఇవ్వలేదన్నారు. హర్ ఘర్ కో జల్ పథకం ఇస్తామన్న 50 శాతం నిధులు ఏవన్నారు. 15వ ఆర్థిక సంఘం మిషన్ భగీరథకు రూ.2350 కోట్లు ఇవ్వాలని చెప్పిందన్నారు. మరి ఆ నిధుల సంగతి ఏంటో కిషన్ రెడ్డి మాట్లాడాలన్నారు. నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం తుంగలో తొక్కుతుందన్నారు.
కృష్ణా జలాల వివాదంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం 20 ఉత్తరాలు రాసిందన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా కేంద్రం అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. 2014లో ప్రచారానికి వచ్చిన మోదీ పాలమూరు కడతామని హామీ ఇచ్చారని, రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు.
బీజేపీ అంటే కూలిపోయే బ్రిడ్జిలు..
గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయి వందల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. బీజేపీ అంటే కూలిపోయే బ్రిడ్జిలు.. ప్రజల ప్రాణాలు నీళ్లపాలు అని ఆరోపించారు. అక్రమంగా సంపాదించే డబ్బులతో ఎమ్మెల్యేలను లిఫ్ట్ చేసే పనిలో బీజేపీ ఉందన్నారు. మునుగోడులో రీసర్చ్ సెంటర్, వంద పడకల దవాఖాన హామీని బీజేపీ విస్మరించిందన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక మునుగోడులో నడ్డా సభ రద్దు చేసుకున్నారు. ఈడీలు, సీబీఐలను కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థగా మార్చిందన్నారు. మోటర్లకు మీటర్ల పేరుతో..
మోటర్లకు మీటర్లు పెడితే రూ.30 వేల కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వంలో ఆశ చూపిందన్నారు. మీటర్లు పెడితే తక్షణమే రూ.6 వేల కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలంగాణ ఆర్థికశాఖకు లేఖ రాసిందని చెప్పారు. అయితే గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. మోటర్లకు మీటర్ల పేరుతో రైతు మెడలో ఉరితాడు బిగించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది 65 లక్షల మంది రైతుల జీవితాలతో ముడిపడిన అంశమన్నారు.
చేనేతకు జీఎస్టీపై పచ్చి అబద్ధాలు..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. చేనేతపై జీఎస్టీని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందని పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. అయితే జీఎస్టీకి ఒప్పుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. చేనేతపై జీఎస్టీని మినహాయించాలని 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. అప్పటి ఆర్థిక మంత్రి ప్రస్తుతం తమ పక్కనే ఉన్నారని.. ఆయనను అడిగి తెలుసుకోవాలని సూచించారు. బీజేపీ నేతలు అసత్యాలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రూ.19 వేల కోట్లు కాదుకదా..
ఫ్లోరైడ్ కోసం రూ.800 కోట్లు ఇచ్చామని కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని, మిషన్ భగీరథకు రూ.19,200 కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసిందన్నారు. రూ.19 వేల కోట్లు కాదుకదా.. రూ.19 కూడా ఇవ్వలేదన్నారు. హర్ ఘర్ కో జల్ పథకం ఇస్తామన్న 50 శాతం నిధులు ఏవన్నారు. 15వ ఆర్థిక సంఘం మిషన్ భగీరథకు రూ.2350 కోట్లు ఇవ్వాలని చెప్పిందన్నారు. మరి ఆ నిధుల సంగతి ఏంటో కిషన్ రెడ్డి మాట్లాడాలన్నారు. నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం తుంగలో తొక్కుతుందన్నారు.
కృష్ణా జలాల వివాదంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం 20 ఉత్తరాలు రాసిందన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా కేంద్రం అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. 2014లో ప్రచారానికి వచ్చిన మోదీ పాలమూరు కడతామని హామీ ఇచ్చారని, రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు.
బీజేపీ అంటే కూలిపోయే బ్రిడ్జిలు..
గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయి వందల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. బీజేపీ అంటే కూలిపోయే బ్రిడ్జిలు.. ప్రజల ప్రాణాలు నీళ్లపాలు అని ఆరోపించారు. అక్రమంగా సంపాదించే డబ్బులతో ఎమ్మెల్యేలను లిఫ్ట్ చేసే పనిలో బీజేపీ ఉందన్నారు. మునుగోడులో రీసర్చ్ సెంటర్, వంద పడకల దవాఖాన హామీని బీజేపీ విస్మరించిందన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక మునుగోడులో నడ్డా సభ రద్దు చేసుకున్నారు. ఈడీలు, సీబీఐలను కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థగా మార్చిందన్నారు.
Also Read : ఒళ్ళు మరిచి ఓటు వేస్తే.. ఇల్లు కాలిపోతది – కెసిఆర్