Saturday, November 23, 2024
Homeసినిమాపుష్ప 2 కు రంగం సిద్ధం

పుష్ప 2 కు రంగం సిద్ధం

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘పుష్ప‘. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ మూవీ ఊహించని విధంగా బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం. దీంతో సౌత్ జనాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ జనాలు కూడా ‘పుష్ప 2’ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చిత్రం పై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉండాలని సుకుమార్ టీమ్ కథ పై కసరత్తు చేస్తూనే ఉంది. ఎట్టకేలకు కథ పై కసరత్తు పూర్తయ్యింది. సెట్స్ పైకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది.

ఇటీవల ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అయితే.. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనేది ప్రకటించలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప 2 అప్ డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల బన్నీ, సుకుమార్ ఉన్న ఫోటోను రిలీజ్ చేయడంతో పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయ్యింది అంటూ ప్రచారం ఊపందుకుంది. వాస్తవం ఏంటంటే.. చిత్రం షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే.. నవంబర్ 7న పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేయడానికి మేకర్స్ ముహుర్తం ఫిక్స్ చేశారని సమాచారం.

ఇక ఈ పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా పరిచయం కానున్నాయి. ప్రముఖ నటీనటులు ఈ సీక్వెల్ లో కనిపించనున్నారు. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయేలా సంగీతం అందిస్తున్నారు. మరి.. పుష్ప సినిమాతో సంచలన విజయం సాధించిన బన్నీ, సుక్కు పుష్ప 2తో అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకుంటారని టాక్.

Also Read : పుష్ప 2 లో సింహం తో బ‌న్నీ ఫైట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్