Friday, June 12, 2026
Homeసినిమాఅల్లువారి అబ్బాయికి ఈ సారి హిట్ పడినట్టే!

అల్లువారి అబ్బాయికి ఈ సారి హిట్ పడినట్టే!

అల్లు శిరీష్ హీరోగా ‘ఊర్వశివో రాక్షసివో‘ సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ వారు సమర్పించిన ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. శిరీశ్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాకి అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చాడు.  ఈ సినిమాలో శ్రీకుమార్ పాత్రలో అల్లు శిరీశ్ .. సింధు పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్ నటించారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది.

ఈ సినిమాలో శ్రీకుమార్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. ఆచారాలు .. పద్ధతులు పాటించే అమ్మమాటనే అతనికి వేదం. సంప్రదాయ బ మైన కుటుంబంలోని పిల్లను కోడలిగా తెచ్చుకోవాలనేది ఆమె ఆశ .. ఆశయం. అందుకు పూర్తి విరుద్ధమైన వాతావరణంలో పెరిగిన సింధు పట్ల శ్రీకుమార్ ఆకర్షితుడు అవుతాడు. ప్రేమ .. పెళ్లి  ఇలాంటి ఆలోచనలు తనకి లేవనీ, తన గోల్స్ తనకి ముఖ్యమని సింధు అంటుంది. ఫ్రెండ్స్ గా ఉండటానికి తనకి అభ్యంతరం లేదని చెబుతుంది. సహజీవనం చేయడానికైతే తాను సిద్ధం అంటుంది. సింధుతో కలిసి ఉంటూనే ఆమెను ఒప్పించవచ్చనే ఉద్దేశంతో శ్రీకుమార్ అంగీకరిస్తాడు.

ఆఫీసులో పనిచేస్తున్న వారిద్దరూ, ఒకే ఇంట్లో ఉండటం మొదలుపెడతారు. తల్లిదండ్రులకు తెలియకుండా చాటుమాటుగా సింధుతో శ్రీకుమార్ సహజీవనం కొనసాగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జరిగిన ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అప్పుడు వాళ్లిద్దరూ ఏం చేస్తారు?  ఎవరి అభిప్రాయం వైపు ఎవరు మొగ్గు చూపుతారనేది కథ. దర్శకుడు రాకేశ్ శశి ఈ కథపై గట్టిగానే కసరత్తు చేశాడు ప్రతి పాత్ర పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకుని డిజైన్ చేశాడు. ఇటు సునీల్ .. అటు వెన్నెల కిశోర్ పాత్రలతో కావాల్సినంత కామెడీని గుప్పించాడు. ఇక రొమాన్స్ కి ఎక్కువ స్పేస్ ఇస్తూ .. ఎమోషన్ టచ్ తో కథకి ఒక మంచి ముగింపును తీసుకొచ్చాడు. అనూ ఇమ్మాన్యుయేల్ గ్లామర్ .. యాక్టింగ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ. సంగీతం .. ఫొటోగ్రఫీ బాగున్నాయి. చాలా కాలం తరువాత ఈ సినిమాతో శిరీశ్ హిట్టు కొట్టాడనే చెప్పుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular