ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు వైఎస్సార్ పెద్ద పీట వేశారని, ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 2లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గూడెం లిఫ్ట్ ద్వారా 50 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారన్నారు. YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర మచిర్యాల జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. లక్సెట్టిపేట వద్ద ప్రజలతో మాట మంతి నిర్వహించిన షర్మిల… YSR పాలన సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.. వైఎస్సార్ ఇంత చేస్తే కేసీఅర్ చేసింది ఎంటి..అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ డిజైన్ చేసి జిల్లాకు అన్యాయం చేశారని షర్మిల విమర్శించారు. తమ్మిడి హాట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టి ఉంటే అదిలాబాద్ జిల్లాకు 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేదని, కేసీఅర్ కనీసం ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు ఇవ్వలేక పోయారన్నారు. అయినా తమ్మిడి హట్టి చేస్తా అన్నారు… తట్టెడు మట్టి కూడా తీయలేదని, వార్ధా ప్రాజెక్ట్ పూర్తి చేసినా లక్ష ఎకరాలకు సాగు నీరు వచ్చేది..ఇప్పటి వరకు ఎందుకు కట్టలేక పోయారని అడిగారు.
సింగరేణిలో అండర్ గ్రౌండ్ బొగ్గు బావులు తవ్వుత అన్నారు…ఓపెన్ కాస్ట్ బంద్ అన్నారు.. ఏది జరగలేదని షర్మిల మండిపడ్డారు. సింగరేణి ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణానికి 10 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తా అన్నారు .ఇవ్వలేదని, వైఎస్సార్ హయాంలో సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులను సైతం మోసం చేశారని, పట్టాలు ఇస్తామని కెసిఆర్ మోసం చేశారన్నారు. పోడు పట్టాలపై అడిగితే మహిళలు అని చూడకుండా జైల్లో పెట్టారని విమర్శించారు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని కేసీఅర్ ముఖ్యమంత్రిగా ఎందుకు ఉన్నట్లు..? -. ఈ యంత్రాంగం ఎందుకు ఉన్నట్లు..ఈ మంత్రులు ఎందుకు ఉన్నట్లు అని షర్మిల ధ్వజమెత్తారు.