Friday, June 12, 2026
HomeTrending Newsనెల్లూరులో కిషన్ రెడ్డి టూర్

నెల్లూరులో కిషన్ రెడ్డి టూర్

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి సింహపురి ఎక్స్ ప్రెస్ రైలులో బయల్దేరి నేటి ఉదయం  నెల్లూరు చేరుకున్న కేంద్ర మంత్రికి బిజెపి కార్యకర్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

ఒకరోజు పర్యటనలో భాగంగా తొలుత జయ భారత్ ఆస్పత్రిలో ఐసీయూ వార్డును ప్రారంభించనున్నారు. అనతరం స్థానిక ప్రజలు, మేధావులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు పల్లిపాడులో పినాకిని ఆశ్రమాన్ని సందర్శిస్తారు. నాలుగున్నరకు నరసింహకొండలో కొలవైన వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. సాయంత్ర ఆరు గంటలకు మహా కార్తీక దీపోత్సవంలో కిషన్ రెడ్డి పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular