Saturday, June 13, 2026
HomeTrending Newsగ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ లోగో ఆవిష్కరణ

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ లోగో ఆవిష్కరణ

విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ – 2023 లోగోను రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 2023 ఫిబ్రవరి 2,3 తేదీల్లో రెండ్రోజులపాటు ఈ సమ్మిట్ జరగనుంది.

పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, మారిటైం బోర్డు సీఈఓ ఎస్‌ షన్‌మోహన్, ఏపీఎంఎస్‌ఎంఈ చైర్మన్‌ వంకా రవీంద్రనాథ్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, ఏపీటీపీసీ చైర్మన్‌ కె రవిచంద్రారెడ్డి, పరిశ్రమలుశాఖ సలహాదారు ఎల్‌ శ్రీధర్, ఏపీఐడీసీ చైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చైర్మన్‌ ఎస్‌ నీరజ్, ఏపీఐడీసీ డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular