Saturday, June 13, 2026
HomeTrending Newsత్వరలో రాజ్ భవన్ ముట్టడి - సిపిఐ

త్వరలో రాజ్ భవన్ ముట్టడి – సిపిఐ

దేశ ప్రధాని కి తెలంగాణ పట్ల అనుకోని ప్రేమ వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. 12 వ తేదీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారని తెలిసిందని, దురుద్దేశం తోనే మోడీ పర్యటన చేపట్టారన్నారు. మునుగోడు ఎన్నికల ఫలితాలతో బిజెపి నేతలు ప్రజలను గందరగోల పరుస్తున్నారని కూనంనేని సాంబశివరావు ఈ రోజు హైదరాబాద్ లో విమర్శించారు. ఎన్నికల తరువాత విజయం సాధించి ఈ ఫ్యాక్టరీ ప్రారంరభిద్ధమని అనుకున్నారని, షెడ్యూల్ కూడా అప్పటిదే అన్నారు. గత సంవత్సరం ప్రారంభమైన ఫ్యాక్టరీ ఇప్పుడు ప్రారంభించడం ఏంటి..?దానిని మేము ఏదో చేశామని మీ ఖాతాలో వేసుకుందాంనుకున్నారా అని మండిపడారు.

ప్రధానమంత్రి మోడికి నైతికత లేదని, మీరు టెక్నీకల్ ప్రధాని మాత్రమేనని కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇక్కడ మీ ప్రభుత్వం లేదు..ఎమ్మెల్యేలను గుంజుకొని ప్రభుత్వం కూల్చాలనుకుంటున్నారన్నారు. 8 సంవత్సరాల్లో తెలంగాణకి మీరు ఎం చేశారని, విభజన చట్టంలోని ఏఒక్క హామీ అయిన నెరవేర్చరా…అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయ్యరం స్టార్ట్ కాదని చెప్పారని, సింగరేణి ఫ్రీవేటికరణ చేసే హక్కు ఎవరు ఇచ్చారన్నారు. మా తెలంగాణ గడ్డ మీద ఉన్న బొగ్గు బావులను ఆధాని అంబానీకి కేటాయించిన నువ్వు మా గడ్డ మీద అడుగు ఎలా పెడతావని, మా బ్యాంక్ ,ఉక్కు కర్మాగారాలు,lic లు ప్రైవేటు కు ఇస్తే ఎలా అన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు రావద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని, 10 వ తేదీ నుండి బొగ్గు కర్మాగారంలో ఆందోళన చేస్తామన్నారు.

తెలుగు మూలాల గల ముఖ్యమంత్రి తమిళ బాషా మాట్లాడుతున్నారు..నల్లులు జలగాళ్ల మాట్లాడుతున్నారని గవర్నర్ హెద్దవా చేస్తూ మాట్లాడారని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తెలంగాణలో మంత్రులను తన ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నానని గవర్నర్ అన్నారని, మీరు గవర్నర్ ఆ..బీజేపీ కార్యకర్తనా.. ముందు తేల్చాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, కేరళ,ఢిల్లీ, తెలంగాణలో గవర్నర్ ల తీరు సరిగా లేదని గవర్నర్ ల వ్యవస్థ సరిగా లేదన్నారు. బ్రిటిష్ కాలం నుండి వచ్చిన ఈ గవర్నర్ వ్యవస్థ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేము మా జాతీయ మహాసభ ల్లో కూడా తీర్మానం చేశామన్నారు. తమిళ్ సై తెలంగాణ వదిలి వెళ్లిపోవాలని, త్వరలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి రాజ్ భవన్ ముట్టడి చేస్తామని కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular