‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామా ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ విషయం తెలిపేందుకు హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కాతో పాలు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… ‘‘రాహుల్ యాదవ్ ఇంతకు ముందు తీసిన రెండు సినిమాలకు నేను అభిమానిని. కొత్త నిర్మాత. ‘మళ్లీరావా’తో గౌతమ్‌ని పరిచయం చేశాడు.. తర్వాత ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో స్వరూప్‌ని డైరెక్టర్‌గా, నవీన్ పోలిశెట్టిని హీరోగా పరిచయం చేశాడు. నవీన్‌కి ఆ సినిమా ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిందే. ఆ రెండు సినిమాలకు నేను అభిమానిని. రాహుల్ అభిరుచిగల నిర్మాత. ఆ రెండు సినిమాల జర్నీ నాకు నచ్చి.. అప్పుడే రాహుల్‌కి మాటిచ్చాను.. తర్వాత ఏదైనా సినిమా ఉంటే.. నువ్వు నిర్మించిన తర్వాత మా ద్వారా రిలీజ్ చేద్దాం అని చెప్పాను.
ఈ మీడియా సమావేశానికి కారణం ఇదే. ఆయన నిర్మించిన ‘మసూద’ చిత్రాన్ని మా ఎస్విసి ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమా టీజర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా, ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. టీజర్ చూడగానే రాహుల్‌కి ఫోన్ చేసి చెప్పాను. ఈ సినిమాతో కూడా కొత్తవారిని పరిచయం చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా చూడబోతున్నాను. ఫైనల్ కాపీ చూసేందుకు ఐయామ్ వెయిటింగ్. రాహుల్‌తో అసోసియేట్ అవడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. నవంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు. ఆల్ ద బెస్ట్ టు రాహుల్ అండ్ ‘మసూద’ హోల్ టీమ్..’’ అని అన్నారు.