Saturday, November 23, 2024
HomeTrending Newsలోకేష్ సబ్జెక్టు తెలుసుకోవాలి: సిద్దార్థ్ రెడ్డి

లోకేష్ సబ్జెక్టు తెలుసుకోవాలి: సిద్దార్థ్ రెడ్డి

గత ప్రభుత్వం క్రీడా వికాస కేంద్రాలను జన సంచారం లేని ప్రాంతాల్లో, కొండల్లో, గుట్టల్లో నిర్మించారని  శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి విమర్శించారు. అవి ఇప్పుడు నిరుపయోగంగా మారి, తాగుబోతులు, తిరుగుబోతులకు అడ్డాలుగా మారాయన్నారు. వాటిని మళ్ళీ క్రీడాకారులకు ఉపయోగ పడేలా చేయడం కోసమే ప్రైవేటు వ్యక్తులకు ‘పే అండ్ ప్లే’ విధానం ద్వారా లీజుకు ఇస్తున్నామని, దీనిలో కూడా 10 శాతం పేద క్రీడాకారులకు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన పెట్టామని సిద్దార్థ్ రెడ్డి వివరించారు. జాతీయ క్రీడల్లో పాల్గొంటున్న ఏపీ క్రీడాకారులను పట్టించుకోలేడంతూ చేసిన వ్యాఖ్యలపై కూగా బైరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూడా విభజన తర్వాత ఏపీలో ఇద్దరు టిడిపి నేతలు ఆంధ్ర ప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ తమదే అని  గల్లా జయదేవ్, సిఎం రమేష్-జేసీ పవన్ ను కోర్టు మెట్లు ఎక్కిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో రాష్రంలో చెప్పుకోదగ్గ స్టేడియం ఒక్కటి కూడా నిర్మించలేదన్నారు. ప్రభుత్వ క్రీడా ప్రాంగణాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వడంపై టిడిపి నేత నారా లోకేష్ చేసిన విమర్శలపై స్పందించారు.

విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి, గచ్చిబౌలి, సరూర్ నగర్, బేగంపేట్ హాకీ టర్బ్, ఎల్బీ స్టేడియంలలో మనకు వాటా ఉందని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని వీటిపై అధికారాలు వదులుకొన్నారని బైరెడ్డి దుయ్యబట్టారు. సచివాలయ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద 2500 మందికి ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తూ, అకాడమీ ఏర్పాటుకు కూడా భూములు కేటాయిస్తున్నామని తెలిపారు.

లోకేష్ సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. శాప్ అనేది ఇండిపెండెంట్ బాడీ అని, ప్రభుత్వం కొంతమేరకే ప్రోత్సాహం ఇస్తుందని, మిగిలినవాటిని తామే సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే రెగ్యులర్ గా క్రీడాకారులు వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటున్న వాటిని లీజుకు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. మిడిమిడి జ్ఞానంతో, తెలిసీ తెలియకుండా ప్రభుత్వంపైన, శాప్ పైన విమర్శలు చేయవద్దని బైరెడ్డి లోకేష్ కు హితవు పలికారు.

Also Read : క్రీడాకారులకు అన్యాయం: లోకేష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్