Saturday, June 13, 2026
Homeసినిమాడిసెంబర్ 30న ‘టాప్ గేర్’ విడుదల

డిసెంబర్ 30న ‘టాప్ గేర్’ విడుదల

ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ అంటూ తన కెరీర్‌కు టాప్ గేర్ వేసేందుకు సిద్దంగా ఉన్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘తీస్ మార్ ఖాన్’, ‘క్రేజీ ఫెల్లో’ అంటూ ఆది రీసెంట్‌గా అందరినీ మెప్పించారు. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమాతో ఆది మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.

ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై అన్ని హంగులతో ఈ టాప్ గేర్ సినిమా రాబోతోంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. ఆయన పోషించిన ఈ రోల్ సినిమాలో కీలకం కానుందని, ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ అనుభూతినిస్తుందని అంటున్నారు మేకర్స్.

ఇప్పటికే ఈ టాప్ గేర్ సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్, 3D మోషన్ పోస్టర్, దీపావళి సందర్భంగా విడుదల చేసిన రొమాంటిక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆది కు జంటగా రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. అంతే కాకుండా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : ఆది సాయి కుమార్ కొత్త సినిమా టైటిల్ టాప్ గేర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular