Friday, June 12, 2026
Homeసినిమాఎన్టీఆర్ మూవీ రిలీజ్ కి టైమ్ ఫిక్స్ అయ్యిందా..?

ఎన్టీఆర్ మూవీ రిలీజ్ కి టైమ్ ఫిక్స్ అయ్యిందా..?

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ మూవీ ‘జనతా గ్యారేజ్’ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. అది ఇప్పటికీ సెట్ అయ్యింది. అయితే.. ఈ క్రేజీ కాంబో మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ.. ఇంత వరకు సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. ఆచార్య డిజాస్టర్ ప్రభావం కొరటాల పై బాగా పడడంతో ఎన్టీఆర్ కథ పై మళ్లీ వర్క్ చేయమని చెప్పారు. ఇక అప్పటి నుంచి కొరటాల కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు కథకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతి త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సెట్స్ పైకి వెళ్లడం ఆసల్యం అవుతుండడంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా..?  లేదా..? అనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇలా డౌట్ రావడంతోనే రీసెంట్ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో వుందంటూ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ తో కొరటాల వున్న ఫోటోలని షేర్ చేసింది చిత్ర బృందం. ఈ విధంగా త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వస్తుందని ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం చిత్రయూనిట్ గోవాలోని అద్భుతమైన లోకేషన్స్ ని సెర్చ్ చేస్తున్నాయి. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తుంది.

సినిమాని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించి డిసెంబర్ లేదా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టాలనే ఆలోచనలో వున్నారట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఫుల్ స్పీడుతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ పై కూడా మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చినట్టుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎప్పుడంటే.. ఈ మూవీని వచ్చే దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నారట. త్వరలోనే యువ సంగీత సంచలనం అనిరుధ్ తో కొరటాల శివ మ్యూజిక్ సిట్టింగ్స్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. మరి.. జనతా గ్యారేజ్ కాంబో మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular