Monday, March 16, 2026
HomeTrending Newsభావి తరాలకు చుక్కా రామయ్య స్ఫూర్తి - మంత్రి ఎర్రబెల్లి

భావి తరాలకు చుక్కా రామయ్య స్ఫూర్తి – మంత్రి ఎర్రబెల్లి

ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సన్మానించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడురు గ్రామానికి చెందిన రామయ్య 98వ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోని ఆయన నివాసంలో కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పూలమాల వేసి, సత్కరించారు. ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం రామయ్య నుంచి మంత్రి ఆశీస్సులను స్వీకరించారు. అదే సమయంలో అరుణోదయ విమలక్క, వందేమాతరం ఫౌల్క్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చుక్క రామయ్య గొప్ప విద్యావేత్తగా… ప్రజల మనిషిగా తన జీవితాంతం ఉన్నారని, ఆయన జీవితం మనందరికీ, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular