Sunday, March 15, 2026
HomeTrending NewsGudivada : ఎవరైనా నేను రెడీ: కొడాలి

Gudivada : ఎవరైనా నేను రెడీ: కొడాలి

గుడివాడలో ఎవరు పోటీ చేసినా తనకు నష్టం లేదని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. గెలుపోటములు నిర్ణయించేది  ప్రజలేనని… చంద్రబాబు, లోకేష్ తో సహా ఎవరు పోటీ చేసినా  వైసీపీ నుంచి తానే పోటీలో ఉంటాని వెల్లడించారు. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలనేది బాబు, లోకేష్, రాబిన్ శర్మ.. లేదా అమెరికాలో ఉండే నలుగురైదుగురు పనికిమాలిన వాళ్ళు కాదని అన్నారు. ఏదో సంఘం, టిడిపి కలిసి వంద కోట్ల రూపాయలు కూడబెట్టి ఇక్కడకు పంపించినంత మాత్రాన ఇక్కడి ప్రజలు ఓటేస్తారనే పిచ్చ భ్రమలో ఉందేవారు… గత ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నారై వెనిగళ్ళ రాము గుడివాడ నుంచి పోటీ చేయబోతున్నట్లు వచ్చిన వార్తలపై కొడాలి స్పందించారు.

చివరి రక్తపు బొట్టు వరకూ వైఎస్సార్సీపీ గెలుపు కోసం  పోరాడతానని ప్రకటించారు. 2024 ఎన్నికలు చంద్రబాబుకే కాదని, తెలుగుదేశం పార్టీకి కూడా చివరి ఎన్నికలని కొడాలి వ్యాఖ్యానించారు. కర్నూలులో న్యాయ రాజధానిపై ప్రశ్నించిన లాయర్లపై గుద్దలూడదీసి కొడతా అంటూ బాబు బెదిరించడంపై నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : మీకు భయపడేది లేదు: కొడాలి నాని  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular