Saturday, June 13, 2026
HomeTrending Newsమంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మెరుపు దాడులు

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మెరుపు దాడులు

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ (IT) శాఖ మెరుపు దాడులు చేస్తోంది. ఈ రోజు వేకువ జాము నుంచే మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడి ఇంట్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ దాడులు చేపట్టింది. తెల్లవారుజాము నుంచే అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. మహేందర్ రెడ్డికి చెందిన కోంపల్లిలోని పాం మెడోస్‌ విల్లాలోనూ సోదాలు చేపట్టారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని దాదాపు 50 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. మరోవైపు మల్లారెడ్డి యూనివర్సిటీ, కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నాయి.

Also Read : కరీంనగర్‌లో ఐటీ, ఈడీ సోదాలు టార్గెట్ మంత్రి గంగుల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular