ఎన్టీఆర్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివతో సినిమా చేయాలి అనుకున్నారు. అయితే.. ‘ఆచార్య’ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో కొరటాలను కథ విషయంలో మార్పులు చేర్పులు చేయమని చెప్పారు. అలా కథ పై కసరత్తు జరుగుతూనే ఉంది. ఇప్పటికి అంతా సెట్ అయ్యింది. అతి త్వరలో ఎన్టీఆర్, కొరటాల మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ ‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన బుచ్చిబాబుతో కూడా సినిమా చేయాలి అనుకున్నారు. కథ విని ఓకే చెప్పారు. దీంతో బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు.
అయితే.. ఆర్ఆర్ఆర్ తరువాత ఏదో తేడా వచ్చింది. బుచ్చిబాబుకు ఎన్టీఆర్ నో చెప్పాడు. ఎన్టీఆర్ సినిమా చేస్తాడని రెండు సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా బుచ్చిబాబు నో చెప్పాడు. ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలి అనుకున్నాడు. అంతా వృధా అయిపోయింది. ఎన్టీఆర్ నో చెప్పడంతో బుచ్చిబాబు రామ్ చరణ్ దగ్గరకు వెళ్లిపోతున్నాడని కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆఖరికి అదే నిజం అయ్యింది. ఏ కథ అయితే ఎన్టీఆర్ కు చెప్పాడో, అదే కథను రామ్ చరణ్ కు చెప్పడం, ఓకె అనడం అయిపోయిందని తెలిసింది. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బుచ్చిబాబు-ఎన్టీఆర్ ప్రాజెక్టు ను ప్రపోజ్ చేసింది. ఇప్పుడు అదే కథ, అదే డైరక్టర్.. హీరో మారాడు.. హీరోతో పాటు నిర్మాణ సంస్థ కూడా మారింది. అవును.. మైత్రీ మూవీస్ ఈ సినిమాను నిర్మించడం లేదు. సన్నిహిత సంబంధాలు వున్న సతీష్ కిలారు ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. తొలి సినిమానే 150 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మించబోతున్నారు. మరి.. రామ్ చరణ్ తో బుచ్చిబాబు ఎలాంటి సినిమా చేస్తారో..? ఎంత వరకు మెప్పిస్తారో.? చూడాలి.