Saturday, June 13, 2026
Homeసినిమాయూత్ లో ఆసక్తిని పెంచుతున్న'లవ్ టుడే'  

యూత్ లో ఆసక్తిని పెంచుతున్న’లవ్ టుడే’  

తెలుగు తెరపై ప్రేమకథలు రాజ్యం చేస్తూనే వస్తున్నాయి. బలమైన కంటెంట్ ఉండాలి గానీ, భారీ హిట్ ను పట్టుకెళ్లి దోసిట్లో పెట్టడంలో తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. అయితే ప్రేమకథలో కంటెంట్ ఎప్పుడూ కూడా ట్రెండ్ ను బట్టి ఉండాలి. ప్రేమకథలో పాత వాసనలు యూత్ కి నచ్చవు. మాటల్లో .. పాటల్లో స్పీడ్ చూపిస్తూనే, ఫీల్ ఉండేలా చూసుకోవాలి. అందువల్లనే ప్రేమకథల్లో కొత్తదనం కోసం మేకర్స్ తమవంతు ప్రయత్నాలు చేస్తూనే వెళుతున్నారు.

ఇక ప్రేమకథలో విషయం ఉంటే చాలు, అది ఏ భాష నుంచి వచ్చింది అనే విషయాన్ని కూడా ఆడియన్స్ పట్టించుకోరు. అందువలన ఇతర భాషల్లో భారీ విజయాలను అందుకున్న ప్రేమకథలు టాలీవుడ్ బాట పడుతూ ఉంటాయి. అలా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెల 25వ తేదీన ‘లవ్ టుడే’ వస్తోంది. ప్రదీప్ రంగనాథన్ – ఇవాన జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 4వ తేదీన తమిళనాట విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. హీరోనే దర్శకత్వం వహించడం విశేషం.

ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. హీరో – హీరోయిన్ ఇద్దరూ స్టార్స్ కాదు. అయినా అక్కడ వసూళ్ల జోరు ఇంతవరకూ తగ్గలేదు. ఇక కంటెంట్ ఉంటే అలాంటివేం ఇక్కడి ఆడియన్స్ పట్టించుకోరనే విషయం ఇటీవలే ‘కాంతార‘ నిరూపించింది. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. నిన్న తెలుగు వెర్షన్ నుంచి వదిలిన ‘పిల్లా పడేశావే ‘ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. చూస్తుంటే ఈ సినిమా ఇక్కడ కూడా కొత్త రికార్డులు సెట్ చేసేలానే ఉంది మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular