ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష (రీ సర్వే) పేరిట జరుగుతోన్న ఈ కార్యక్రమం రెండో విడతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించనున్నారు. అదే విధంగా తొలివిడత రీ సర్వే పూర్తయిన 1.20 లక్ష రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీని కూడా సిఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ సొంత నియోజక వర్గం లో ఈ కార్యక్రమం జరుగుతోంది.
నవంబర్ 23న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11.00 – 12.55 వరకు బహిరంగ సభలో సీఎం ప్రసంగం, లబ్ధిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.