Sunday, November 24, 2024
Homeసినిమానాన్న గురించి మహేష్ ఎమోషనల్ పోస్ట్.

నాన్న గురించి మహేష్ ఎమోషనల్ పోస్ట్.

 కృష్ణ తెలుగు తెర పై ఎన్నో సాహసాలు చేసి డేరింగ్ అండ్ డాషింగ్ అనే పదానికి అసలైన నిర్వఛనం ఇచ్చారు. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఈ నటశేఖరుడు కృష్ణ ఇక లేరు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. నాటి నుంచి నేటి వరకు  దాదాపు 350 చిత్రాలతో ఎంతగానో ఎంటర్ టైన్ చేశారు. ఈ విషాదంతో ఘట్టమనేని వారి ఇంట తీవ్ర విషాదం నెలకొనగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరింత దుఃఖం లోకి వెళ్లిపోయారు. ఈ సంవత్సరంలో అన్నయ్య రమేష్‌ బాబు, అమ్మ ఇందిరా దేవి, నాన్న కృష్ణను కోల్పోవడం బాధాకరం.

కొడుకుగా అయితే సినీ ప్రస్థానంలో తెలుగు సినిమా వద్ద సూపర్ స్టార్ కి సిసలైన వారసునిగా తన సత్తా చాటాడు. సూపర్ స్టార్ మహేష్ తన సోషల్ మీడియా ద్వారా కృష్ణ యంగ్ ఏజ్ లో ఉన్న ఓ మెమొరబుల్ ఫోటో ని షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ ని అయితే పోస్ట్ చేశారు. మీ ఇన్నాళ్ల జీవితం ఓ సంబరం అదే విధంగా మీ ముగింపు కూడా ఓ గొప్ప అంతిమ ప్రయాణం. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా డేరింగ్ అండ్ డాషింగ్ గా గడిపారు. నా ఇన్ స్పిరేషన్, నా ధైర్యం మీరే, ఇప్పుడు నాలో నేను కొత్తగా ఉన్న నన్ను చూసుకుంటున్నాను. మీరు లేకపోయినా సరే మీరు ఇచ్చిన కాంతి ఇంకా నాలో ప్రకాశిస్తుంది.

మీ లెగసిని నేను ముందుకు తీసుకెళ్తాను. లవ్ యూ నాన్న. మై సూపర్ స్టార్ అంటూ మహేష్ ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలిపారు. దీనితో ఈ పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిగా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. నాన్న మరణంతో మహేష్ ఇప్పట్లో షూటింగ్ చేయరు అనుకున్నారు కానీ.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ కి వస్తానని చెప్పారట. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ భారీ, క్రేజీ మూవీని సాధ్యమైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read : ఆకాశంలో ఒక తార సూపర్ స్టార్ కృష్ణ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్