Friday, June 12, 2026
Homeసినిమావీరయ్య, వీరసింహారెడ్డి రిలీజ్ డేట్స్ ఇవే.

వీరయ్య, వీరసింహారెడ్డి రిలీజ్ డేట్స్ ఇవే.

చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య‘. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. భారీగా ప్రమోషన్స్ చేయాలనే ఉద్దేశ్యంతో ఫస్ట్ సింగిల్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ‘పార్టీ సాంగ్’ అంటూ రిలీజ్ చేసిన ఈ పాటకు అనూహ్య స్పందన లభిస్తుంది. అయితే.. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య రిలీజ్ అని ప్రకటించారు కానీ.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ఎప్పడు అనేది అనౌన్స్ చేయలేదు.

బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తుంది. అలాగే ఈ సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘జై బాలయ్య’ అనే పాటను కూడా రిలీజ్ చేశారు. ఎనర్జిటిక్ గా ఉన్న ఈ పాట కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే.. వీరసింహారెడ్డి మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు కానీ.. ఎప్పుడు అనేది డేట్ అనౌన్స్ చేయలేదు.

ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పై అందుకున్న లేటెస్ట్ సమాచారం ఏంటంటే… 2023 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ రెండు బడా మూవీస్ కేవలం ఒకే ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా వీటిలో వాల్తేరు వీరయ్య జనవరి 12న అలానే వీరసింహా రెడ్డి జనవరి 13న విడుదల కానున్నాయని టాక్ వినిపిస్తోంద. దీనిని బట్టి చూస్తే రాబోయే సంక్రాంతికి అటు బాలకృష్ణ, ఇటు చిరంజీవిల సినిమాల మధ్య భారీ బాక్సాఫీస్ వార్ జరగనుంది. మరి.. ఈ బాక్సాఫీస్ వార్ లో విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular