హుజురాబాద్ ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలంగాణా జన సమితి (టిజేఎస్) అధ్యక్షుడు ప్రొ. కోదండరాం వెల్లడించారు. అధికార టిఆర్ఎస్ తమపై దుష్ప్రచారం చేస్తోందని అయన మండిపడ్డారు. కొద్దిరోజులు బిజెపికి దగ్గరవుతున్నారని ప్రచారం చేశారని, ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ తమపై ప్రచారం మొదలుపెట్టారని కోదండరాం అసహనం వ్యక్తం చేశారు.
కేసియార్ నియంతృత్వ, ఆస్తులు పెంచుకునే విధానాలపై తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఆస్తుల సంపాదన, పార్టీలో అంతర్గతంగా ఎవరిని సహించకపోవడం లాంటి పోకడల వల్లే హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు. డబ్బు కుమ్మరించి ఎలాగోలా గెలవాలనే తాపత్రయం టిఆర్ఎస్ లో కనిపోస్తోందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 25 నియోజకవర్గాల్లో మా పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిన్చుకుంటుందని చెప్పారు. ఆగస్టు నెల చివరి లో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామని తెలియజేశారు