Friday, June 12, 2026
HomeTrending Newsసీఎం వస్తుంటే అరెస్టులు చేస్తారా..రేవంత్ ఆగ్రహం

సీఎం వస్తుంటే అరెస్టులు చేస్తారా..రేవంత్ ఆగ్రహం

కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ అప్రజాస్వామిక చర్య టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దామరచర్ల కు ఈ రోజు ముఖ్యమంత్రి వస్తే గతంలో ఆయన హామీ ఇచ్చిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అన్నారు. భూ నిర్వాసితులకు పరిహారాలు, ఇతర సౌకర్యాలు, స్థానికులకు ఉద్యోగాలు, పోడు భూములకు పట్టాలు, జాబ్ కార్డ్స్ గురించి కాంగ్రెస్ నాయకులు సీఎం ను ఆడిగారు. డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం ముఖ్యమంత్రిని ఆడిగేందుకు వెళ్లడం నేరమా.. అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ ను, ఆడివిదేవిపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ ప్రాంత నాయకులను అరెస్టులు చేసి జైళ్లలో నిర్బంధించారన్నారు. వారిని వెంటనే భేషరతుగా విడుదల చేయాలి. దామరచర్ల ప్రాంతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడుతాం.. రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Also Read : వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular