ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులోక్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని శుక్రవారం నాడు కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ద్వారా సీబీఐ సమాచారం ఇచ్చింది. దానికి కవిత స్పందిస్తూ శనివారం రోజున సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి లేఖ రాశారు. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు.