Saturday, June 13, 2026
HomeTrending Newsమహేష్‌, రాజమౌళి మూవీ పై క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్

మహేష్‌, రాజమౌళి మూవీ పై క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేస్తానని రాజమౌళి ప్రకటించినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. మహేష్‌ ని రాజమౌళి ఎలా చూపించనున్నారు..? ఏ తరహా మూవీ చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది.

అయితే… పారెస్ట్ అడ్వంచర్ నేపధ్యంలో సాగే యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ టైమ్ లో జక్కన్న మహేష్ మూవీని 2023 జనవరిలో స్టార్ట్ చేయనున్నట్టుగా చెప్పారు. అయితే.. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలి. ఈ నెలలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయాలి. ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి టైమ్ పడుతుంది. అందుచేత రాజమౌళితో మహేష్ మూవీ ఆలస్యం అవుతుంది. మరి.. ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందంటే… 2023 జూన్ అని స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్ వ్యూలో బయటపెట్టారు.

వచ్చే ఏడాది జూన్‌ నాటికి షూటింగ్‌ ప్రారంభించనున్నాం. ఎన్నో రోజుల నుంచి రాజమౌళి ఇలాంటి సాహసోపేతమైన కథను తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. ఈ కథకు మహేష్‌ సరిగ్గా సరిపోతాడని అతనిని ఎంపిక చేసుకున్నాడు. నేను తనని దృష్టిలో పెట్టుకొని కథ రాశాను. ఈ చిత్ర షూటింగ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రదేశాల్లో చిత్రీకరించాలని అనుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. దీంతో ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో మహేష్‌, రాజమౌళి చరిత్ర సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ జనాలు

Also Read : రాజమౌళి గారే నాకు స్ఫూర్తి: అడివి శేష్  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular