Saturday, June 13, 2026
HomeTrending Newsఅడివి శేష్ అంత టార్చర్ పెడతాడా అనుకున్నాను: సత్యదేవ్

అడివి శేష్ అంత టార్చర్ పెడతాడా అనుకున్నాను: సత్యదేవ్

సత్యదేవ్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘గుర్తుందా శీతాకాలం‘ ముస్తాబవుతోంది. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యదేవ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా తమన్నా .. మేఘ ఆకాశ్ .. కావ్య అలరించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.  ఈ నేపథ్యంలో అడివి శేష్ ముఖ్య అతిథిగా నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.  ఈవెంటులో సత్యదేవ్ మాట్లాడుతూ .. ” నా సినిమా ఫంక్షన్ కి అడివి శేష్ రావడం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. తను ఎంతకష్టపడతాడో నాకు తెలుసు. ఒక కథ ఆయన దగ్గరికి వెళితే, ఆ కథ గురించి వంద ప్రశ్నలు అడుగుతాడని కొంతమంది నాతో అన్నారు. బుర్ర తినేస్తాడని చెప్పారు. నిజంగా శేష్ అంత టార్చర్ పెడతాడా? అనుకున్నాను.  కానీ ఇప్పుడు అర్థమవుతోంది .. ఆయన అలా బుర్ర తినడం వల్లనే వరుస హిట్లు పడుతున్నాయని. అలాంటి శేష్ రావడం వలన మా సినిమా కూడా హిట్ అవుతుందని నేను భావిస్తున్నాను” అన్నాడు. ఇక శేష్ మాట్లాడుతూ .. ” నా సినిమాల్లో సత్యదేవ్ దేవ్ కి మంచి రోల్ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ వస్తున్నాను. కానీ తను అందుబాటులో ఉండటం లేదు. చూస్తుండగానే ఆయన నార్త్ కి కూడా వెళ్లిపోయాడు. ఆయన చేసిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular