Wednesday, June 17, 2026
HomeTrending Newsజగిత్యాల మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన

జగిత్యాల మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన

జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్‌ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్‌ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనుండగా.. సీఎం కేసీఆర్‌ భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జగిత్యాలలో మెడికల్‌ కాలేజీని ప్రకటించారు. గతేడాది 1001 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులకు అనుమతి అనుమతి ఇచ్చారు.

కళాశాలకు అనుబంధంగా 330 బెడ్స్‌ దవాఖానకు మంజూరు చేసి తాత్కాలిక భవనంలో ప్రారంభించారు. ఈ యేడాది మే 7న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దవాఖానను ప్రారంభించగా.. నవంబర్‌ 15న సీఎం కేసీఆర్‌ వర్చువల్‌ విధానంలో ప్రగతి భవన్‌ నుంచి మెడికల్‌ కాలేజీ తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే. మెడికల్‌ కాలేజీకి సొంత భవన నిర్మించేందుకు రూ.119కోట్లు కేటాయించింది. రెండెకరాల్లో మెడికల్‌ కాలేజీ, అరెకరంలో విద్యార్థుల క్యాంపస్‌, మరో అరెకరంలో బాలుర క్యాంపస్‌, దాదాపు నాలుగు ఎకరాల్లో అనుబంధ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం చేపట్టనున్నారు.

అంతకు ముందు జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లోని సీట్లో కలెక్టర్‌ జీ రవిని కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ప్రభుత్వం కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

Also Read : అధునాతన సౌకర్యాలతో జగిత్యాల కలెక్టరేట్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular