టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు రమణ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకరరావులతో సమావేశమయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.