Tuesday, June 16, 2026
Homeసినిమామహేష్ మూవీలో సింగర్ సునీత?

మహేష్ మూవీలో సింగర్ సునీత?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్‌ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ డిసెంబర్ లో స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. మహేష్ జనవరి నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ చేద్దామని మహేష్‌ చెప్పారని తెలిసింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.

అయితే… మహేష్‌ తో త్రివిక్రమ్ ముందు ఓ కథ అనుకున్నారు. ఆ కథ కోసం ఫస్ట్ షెడ్యూల్ లో ఓ ఫైట్ కూడా చిత్రీకరించారు. ఆ కథను మార్చమని మహేష్ చెప్పడంతో పూర్తిగా కథను మార్చేసి ఇప్పుడు తనదైన స్టైల్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రెడీ చేశారట త్రివిక్రమ్. ఈ కథకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకుంటున్నారని తెలిసింది. అయితే… ఇందులో మహేష్ సొదరి క్యారెక్టర్ ఉందట. ఆ క్యారెక్టర్ ను పాపులర్ సింగర్ సునీతతో చేయించాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో మహేష్ సోదరిగా సింగర్ సునీత నటించడం నిజమా..?  లేక గాసిప్పా..? అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సినీజనాలు.

సునీత ఇప్పటి వరకు బుల్లితెర పై టాక్ షోలు, స్పెషల్ షోల్లో కనిపించింది కానీ.. వెండితెర పై కనిపించలేదు. అయితే.. త్రివిక్రమ్ రిక్వెస్ట్ చేయడంతో సునీత ఓకే చెప్పిందట.  దీనిపై అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. త్వరలోనే ఈ సినిమాలో సునీత నటించడం గురించి ప్రకటిస్తారేమో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular