స్కూళ్లు తెరిచేలోగా ఉపాధ్యాయులందరికీ వాక్సినేషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్లు అందరికీ వాక్సినేషన్ ఇవ్వాలని సూచించారు. వ్యాక్సిన్ లభ్యతను బట్టి డిగ్రీ విద్యార్ధులకు కూడా వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలన్నారు. కోవిడ్–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాగోన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విద్యార్ధులకు ఆయా కాలేజీల్లోనే క్యాంపులు పెట్టి వాక్సిన్ ఇవ్వాలని అధికారులకు దిశా నిర్దేశించారు.
సిఎం చేసిన సూచనలు
- ఫీవర్ సర్వే అనంతరం ఫోకస్డుగా టెస్టులు చేయాలి
- ఎవరికైతే జ్వరం ఇతర లక్షణాలుంటాయో వారికే పరీక్షలు చేయాలి,వారికి తగినమందులు అందించాలి
- కేసులు సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలన చేయండి
- వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టండి
- కోవిడేతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి
- వర్షాకాలం ప్రారంభమైన నేపధ్యంలో ఆ మేరకు సన్నద్ధంగా ఉండండి
- పీహెచ్‌సీల వారీగా సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలి
- పామ కాట్లు పెరిగే అవకాశాలున్నాయి, మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో పాముకాట్లు ఎక్కువగా ఉంటాయి
- వాటికి సంబంధించి ఇంజక్షన్లు సిద్ధంగా ఉంచాలి
- ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ వంటి వ్యాధులు వర్షాకాలంలో ప్రబలే అవకాశం ఉంది
- వాటికి సంబంధించిన మందులు పీహెచ్‌సీల్లో, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్నాయో ? లేదా ? చూసుకొండి, ఆ మేరకు సన్నద్ధంగా ఉండండి
- ఆ మందులు కూడా డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలతో ఉండేలా చూడాలి
- థర్డ్ వేవ్ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలి
- చిన్నపిల్లల వైద్యుల నియామకం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సన్నద్దతపై పూర్తి స్ధాయి సమీక్ష చేసుకొండి
- మందులు కూడా సిద్ధంగా ఉండాలి….. అని అధికారులకు సూచించారు.