Tuesday, March 10, 2026
Homeసినిమా‘నారప్ప’ వచ్చేది ఓటీటీలోనే

‘నారప్ప’ వచ్చేది ఓటీటీలోనే

విక్టరీ వెంకటేష్‌ – శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రూపొందిన భారీ యాక్షన్ మూవీ నారప్ప. తమిళ్ లో బ్లాక్ బస్టర్ సక్సస్ సొంతం చేసుకున్న ‘అసురన్’ చిత్రానికి రీమేక్ గా రూపొందిన ‘నారప్ప’ చిత్రం ఓటీటీలో రానుందని.. నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థకు భారీ మొత్తానికి అమ్మేశారని వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై విమర్శలు వచ్చాయి. రీసెంట్ గా థియేటర్ల ఓనర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయవద్దని, అక్టోబర్ వరకు ఆగాలని నిర్మాతలను కోరారు.

ఇక వెంకటేష్ అభిమానులు కూడా నారప్ప చిత్రాన్ని థియేటర్లోనే రిలీజ్ చేయాలని కోరడం జరిగింది. అంతే కాకుండా.. ఓ అభిమాని ఏకంగా ఒక రోజు నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. అయితే.. సురేష్ బాబు ఆలోచనలో పడ్డారని.. ఓటీటీతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా.. వెంకీ కూడా థియేటర్లోనే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అవసరమైతే.. తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకునేందుకు సిద్దపడ్డారు అని వార్తలు వచ్చాయి. అయితే.. ఏమైందో ఏమో కానీ.. నారప్ప చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టుగా ఈరోజు ప్రకటించారు. జులై 20న అమెజాన్ ప్రైమ్ లో నారప్ప విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular