Tuesday, March 10, 2026
Homeసినిమావెంకీ 75, నాగ్ 100 మూవీస్ కి సర్వం సిద్ధం

వెంకీ 75, నాగ్ 100 మూవీస్ కి సర్వం సిద్ధం

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150…. బాలయ్య 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బాక్సాఫీస్ వద్ద విజయం దక్కించుకున్నాయి. ఇప్పుడు నాగార్జున, వెంకటేష్.. కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీస్ దగ్గరకు చేరువయ్యారు. నాగార్జున 100 వ చిత్రానికి, వెంకటేష్ 75వ చిత్రానికి చేరవయ్యారు. చిరంజీవి.. బాలయ్య తరహాలో మైల్ స్టోన్ చిత్రాలు స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

నాగార్జున ది ఘోస్ట్ మూవీ 99వ చిత్రంగా ప్రచారంలోకి వచ్చింది కానీ.. అది 98 గా లెక్క తేలింది. దీంతో 99వ సినిమా ఇప్పటికే లాక్ అయినట్లు సమాచారం. ఈ సినిమాకి రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలు హిట్ సినిమాలకు రచయితగా పని చేసిన ప్రసన్న నాగ్  సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. అటుపై 100వ చిత్రాన్ని మాత్రం చాలా స్పెషల్ గా ఉండేలా చూసుకుంటున్నారు. కెరీర్ కిది మైల్ స్టోన్ మూవీ కాబట్టి ఖచ్చితంగా హిట్ కంటెంట్ తోనే రావాలని ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. మోహన్ రాజా, విక్రమ్. కె. కుమార్  లు ఈ సినిమా రేస్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే.. 74 చిత్రాలు పూర్తి చేసి 75వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. చివరిగా ఎఫ్ 3 తో మెప్పించిన తర్వాత ఇంత వరకూ కొత్త దర్శకుడ్ని ఫైనల్ చేయలేదు. జాతిరత్నాలు, ప్రిన్స్ చిత్రాల దర్శకుడు అనుదీప్ తో వెంకీ 75వ చిత్రం చేయనున్నారని సమాచారం. మరి.. నాగ్ 100, వెంకీ 75 చిత్రాలతో సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular