మాస్ మహారాజ రవితేజ కెరీర్‌లో 68వ మూవీగా శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాతగా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ వర్క్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రానికి `రామారావు ఆన్ డ్యూటీ` అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. ఈ రోజు ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదలచేసింది చిత్ర యూనిట్. రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి నూతన దర్శకుడు దర్శకత్వం వహించినప్పటికీ, దీనికి సంబంధించిన ప్రతి అనౌన్స్‌మెంట్ ఈ మూవీపై క్యూరియాసిటీని పెంచింది. ఇప్పటివరకూ విడుదలచేసిన రెండు పొస్టర్స్‌లోనూ రవితేజ ముఖం కనిపించనప్పటికీ ఆ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవితేజ హాఫ్ స్లీవ్ షర్ట్, ఫార్మల్ ప్యాంటు వేసుకుని ట్రెండీ గాగుల్స్‌తో సూపర్‌స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే నిజాయితీ మరియు దూకుడుగా ఉన్న ప్రభుత్వ అధికారిగా రవితేజ నటించారని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ పోస్టర్‌లో బి. రామారావుగా ప్రమాణ స్వీకారపు లేఖ కూడా ఉంది. ఆయనకు కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని బ్యాక్‌గ్రౌండ్ లో చూడవచ్చు. టైటిల్ పోస్టర్ కూడా అద్భుతంగా రూపొందించబడింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. `రామారావు ఆన్ డ్యూటీ` రియల్ ఇన్స్‌టెండ్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రవితేజ, హీరోయిన్లలో ఒకరిగా నటిస్తోన్న దివ్యాంశ కౌశిక్ మరియు ఇతర తారాగణం పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. కేఎల్ ప్రవీణ్ ఎడిటర్. రవితేజ, దివ్యాంశ కౌశిక్, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ, ఈ రోజుల్లో శ్రీ, మధుసూధన్ రావు, సురేఖ వాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.