పార్లమెంటు సమావేశాల్లో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంపునకు సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందిందని కేంద్రమత్రి అర్జున్ ముండా తెలిపారు. ఆ రిజర్వేషన్లను 10 శాతం వరకు పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోంశాఖకు చేరిందని చెప్పారు.