Saturday, January 18, 2025
Homeసినిమారాక్‌స్టార్‌కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ పంపిన‌ ఐకాన్‌స్టార్

రాక్‌స్టార్‌కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ పంపిన‌ ఐకాన్‌స్టార్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలు మ్యూజిక‌ల్‌గా ఎంత‌టి సెన్సేష‌న్‌ క్రియేట్ చేశాయో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్‌ల ప్యాన్ఇండియా ప్రాజెక్ట్‌ `పుష్ప`కు సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు దేవి… వీరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో తమ కెరీర్ ప్రారంభం నుండి కలిసి పనిచేస్తున్న బన్నీ, డీఎస్పీల మధ్య అనుబంధం మ‌రింత బలపడింది. కాగా తన సన్నిహితులకు, స్నేహితులకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అల్లు అర్జున్ కు అలవాటు. తాజాగా అలాంటి స్వీట్ సర్‌ప్రైజ్‌ను డీఎస్పీకి పంపారు బ‌న్నీ.

బన్నీ ‘రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్’ అనే లైటింగ్ నేమ్ బోర్డ్ డిజైన్ ను ప్రత్యేకంగా తయారు చేయించి దేవికి పంపారు. అల్లు అర్జున్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ను ఎంతో ఆనందంగా తన ట్విటర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు దేవిశ్రీ ప్రసాద్…‘ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నుంచి సర్‌ప్రైజ్‌ ‘రాక్‌స్టార్‌’ గిఫ్ట్‌ . థాంక్యూ సో మచ్ మై డియరెస్ట్ బన్నీ బాయ్…లవ్లీ స‌ర్‌ఫ్రైజ్‌…అస్సలు ఎక్స్పెక్ట్ చేయ‌లేదు. నువ్వు చాలా స్వీట్ ప‌ర్స‌న్‌’, అంటూ ఒక వీడియో ద్వారా బ‌న్నీకి స్పెష‌ల్ థ్యాంక్స్ తెలిపారు రాక్‌స్టార్‌.

RELATED ARTICLES

Most Popular

న్యూస్