Tuesday, June 16, 2026
HomeTrending NewsMacherla violence: బాబు, లోకేష్ లదే బాధ్యత: పిన్నెల్లి

Macherla violence: బాబు, లోకేష్ లదే బాధ్యత: పిన్నెల్లి

చంద్రబాబు, లోకేష్ లు తమ రాజకీయ అవసరాల కోసం బ్రహ్మారెడ్డిని అడ్డుపెట్టుకొని పచ్చని పల్నాడులో కార్చిచ్చు రేపుతున్నారని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.  ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని కావాలనే అల్లర్లు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకునేందుకు ప్రయతిస్తున్నారని విమర్శించారు.

నిన్న జరిగిన ఘటన టిడిపి నేతలు ఓ  ప్లాన్‌ ప్రకారం, ముందస్తు వ్యూహంతోనే చేశారని, అసలు మాచర్లలో టీడీపీకి పార్టీ కార్యాలయమే లేదని పిన్నెల్లి అన్నారు. బ్రహ్మారెడ్డి ఉండే ఇంటిని  టీడీపీ కార్యకర్తలే తగలబెట్టారని,  ప్రజల్లో సింపతి కోసమే ఇలా చేశారని ధ్వజమెత్తారు.

వైఎస్ఆర్‌ సీపీ కార్యకర్తలపై దాడి చేశారని, ఓ బిసి కార్యకర్త  చావుబతుకుల మధ్య ఉన్నారని దీన్ని పక్కదారి పట్టించేందుకే అచ్చెన్నాయుడిని ముందు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.  రెచ్చగొట్టి గొడవలు చేయాలని చూస్తున్నారని,  గొడవకు కారణమైన బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  బీసీలు సీఎం జగన్‌ వైపు ఉన్నారని తట్టుకోలేకపోతున్నారని, అందుకే బీసీలను దూషించి దాడులు చేస్తున్నారని ఇది దుర్మార్గమని పిన్నెల్లి దుయ్యబట్టారు.

Also Read : మాచర్లలో పరిస్థితి అదుపులో ఉంది : జిలా ఎస్పీ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular