ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో చేసిన అనుచిత వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విజయవాడ లో నిర్వహంచిన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గున్నారు
ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు చెందిన మంత్రి చేసిన వ్యాఖ్యలు అత్యంత గర్హనీయమని, దిగజారుడు వ్యాఖ్యలని నేతలు మండిపడ్డారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, ప్రపంచ దేశాలతో పోటీపడడం చేతకాని పాకిస్తాన్, ఉగ్రవాద పునాదులపై ఎదగాలని చూస్తోందని విమర్శించారు. మన ప్రధానివ మోడీ గారి సారధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి వస్తోన్న పేరు ప్రఖ్యాతులను ఓర్చుకోలేక, మరోవైపు ఆ దేశంలో రోజురోజుకూ ముదురుతోన్న ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం చేతగాక ఇలాంటి నీచబుద్ధిని చాటుకున్నారని పేర్కొన్నారు.
ప్రధాని మోడీపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, పాకిస్తాన్ మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే తగిన గుణపాఠం చెప్పడానికి భారత్ సిద్ధంగా ఉందంటూ హెచ్చరించారు. అనంతరం నేతలు బిలావల్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.