Monday, June 15, 2026
Homeసినిమా పవన్, హరీష్ శంకర్ మూవీ హీరోయిన్ ఎవరో?

 పవన్, హరీష్ శంకర్ మూవీ హీరోయిన్ ఎవరో?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రావాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ ను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా మార్చి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత నిర్మిస్తోంది.

ఈ సినిమా కోసం గతంలో పవన్ కళ్యాణ్ కు జంటగా క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డేను తీసుకున్నారు. ఇప్పుడు పూజా వేరే సినిమాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలిసింది. మరి.. పూజా తప్పుకుంటే.. పవన్ కు జంటగా నటించేది ఎవరు అంటే.. అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ పేరు వినిపిస్తుంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన జాన్వీ తెలుగు సినిమాల్లో నటించాలని వుందని.. ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ వస్తే వదులుకోను అని చెప్పింది. దీంతో ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా కోసం జాన్వీని ఎంపిక చేశారని సమాచారం.

తాజాగా పవన్ కళ్యాణ్‌, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా జాన్వీ కపూర్ ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. చరణ్‌ సరసన బుచ్చిబాబు మూవీలో జాన్వీ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పవన్ మూవీలో కూడా జాన్వీ నటించనుందని టాక్ రావడంతో.. అబ్బాయ్ చరణ్‌, బాబాయ్ పవన్ తో జాన్వీ నటిస్తుందా అనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular