గాంధీభవన్ లో పైరవీకారులకే పెద్దపీట, పదవులు దక్కుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడులో నన్ను బూతులు తిట్టిన వారిపై విచారణ చేయాలన్నారు. ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీల్లో తాము ఇచ్చిన పేర్లను పట్టించుకోలేదని ఎంపీ కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సీనియర్లకు అన్యాయం జరిగిందని, దిగ్విజయ్ సింగ్ ఈ విషయాలపై విచారించాలని డిమాండ్ చేశారు. దిగ్విజయ్ రావడం హర్షించదగ్గ పరిణామమని, ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న నేత దిగ్విజయ సింగ్ అన్నారు. తెలంగాణలో సమస్యలు దిగ్విజయ్ సింగ్ కు తెలుసునని..పార్టీలో సమస్యలు ఆయన పరిష్కరిస్తారనే నమ్మకం ఉందన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులపై ఆయనకు అవగాహన ఉందన్న ఎంపీ కోమటిరెడ్డి హుజురాబాద్ పరిణామాలపై, తనపై ఆరోపణల పేరుతో వాడిన పదజాలంపై దిగ్విజయ్ విచారణ జరపాలని కోరారు. ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ ను కలుస్తా అన్న ఎంపి..కమిటీల్లో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఢిల్లీ పెద్దల సూచన మేరకే కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నానని వెల్లడించారు. ప్రతీ కార్యకర్త పిసిసి చీఫ్ తో సమానమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో మార్పులు వస్తాయని అన్నారు.
Also Read : ప్రధాని మోడీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ