అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్ ’ ను తయారు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.
ప్రతి సంవత్సరం ఖాళీల భర్తీకై.. ‘వార్షిక నియామక కేలెండర్’ (జాబ్ కేలెండర్) ను తయారు చేసి అందుకు అనుగుణంగా విధిగా భర్తీ ప్రక్రియ నిర్వహించాలని కేబినెట్ ఆదేశం.
ఉద్యోగ ఖాళీల భర్తీకై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు రేపు కూడా కేబినెట్ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని కేబినెట్ ఆదేశించింది. రేపు మధ్యాహ్నం తిరిగి రెండు గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానున్నది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏడు జిల్లాలలో పర్యటించి వచ్చిన ఆరోగ్యశాఖ కార్యదర్శి ఇతర అధికారులు, ఆయా జిల్లాలలో నెలకొన్న కోవిడ్ పరిస్థితి, తీసుకున్న చర్యలు, నివారణకై ఇచ్చిన సూచనలు, తదితర క్షేత్రస్థాయి పరిశీలనలను, కేబినెట్ కు వివరించారు.
మందులు ఆక్సీజన్ లభ్యత, ఇతర మౌలిక వసతులు సౌకర్యాల పై కేబినెట్ పూర్తిస్థాయిలో చర్చించింది. వ్యాక్సినేషన్, పడకల లభ్యత, జౌషదాల లభ్యత సహా మూడో వేవ్’ కు సంబంధించిన సన్నద్దత గురించి వైద్యరోగ్యశాఖ అధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు.
కరోనా నియంత్రణకు సంబంధించి వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల అనుమతులను ఇచ్చిన నేపథ్యంలో, మందులను అందుబాటులో ఉంచడం, జ్వర సర్వేతో సహా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, ఆయా నియోజకవర్గాలకు చెందిన స్థానిక విద్యార్థినీ విద్యార్థులకు 50 శాతం సీట్లను కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, మరియు అధికారుల కేటాయింపులు చేపట్టాల్సిందిగా టీఎన్ జీవో , టీజీవో ప్రతినిధులు సిఎం కెసిఆర్ కు చేసిన విజ్జప్తిని పురస్కరించుకుని అందుకు సంబంధించి కేబినెట్ చర్చించింది.
ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే చేపట్టాలని , ఖాళీల గుర్తింపు మరియు భర్తీ ప్ర్రక్రియ సత్వరమే జరగాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.
ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే చేపట్టాలని , ఖాళీల గుర్తింపు మరియు భర్తీ ప్ర్రక్రియ సత్వరమే జరగాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.