Sunday, June 14, 2026
HomeTrending Newsకానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు సీఎం తీపికబురు

కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు సీఎం తీపికబురు

కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు సంబంధించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగార్థుల విజ్ఞప్తిమేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంవల్ల చాలామంది ఈ ఉద్యోగాలకోసం పోటీపడేందుకు అవకాశం లభిస్తోంది. పలు పోలీసు ఉద్యోగాల భర్తీచేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలమేరకు వీటి భర్తీకోసం పోలీస్‌శాఖ అక్టోబరు 20న నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో 6,100 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి(మరో 411 ఎస్పై పోస్టులుకూడా నోటిఫికేషన్‌లో ఉన్నాయి). వయోపరితిని పెంచి తమకు కూడా అర్హత కల్పించాలంటూ కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులపై సీఎం అధికారులతో సమావేశమయ్యారు. వారికి అవకాశం కల్పించేలా రెండేళ్లపాటు వయోపరిమితి పెంచుతూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular