శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని (డిసెంబర్ 25) పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
వొక వైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు గొప్పగా పురోగమిస్తున్నా.. మరోవైపు మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో, క్రీస్తు బోధనలు ఆచరణీయాలని సీఎం అన్నారు. శత్రువునైనా క్షమించే గొప్ప గుణం,సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైనది గా సీఎం కేసిఆర్ తెలిపారు.
ఏసుక్రీస్తు దీవెనలు ప్రలందరికీ లభించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.