Sunday, June 14, 2026
Homeసినిమానేడు 'వాల్తేరు వీరయ్య' టైటిల్ సాంగ్

నేడు ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు వచ్చేలా చేసేందుకు మేకర్స్ అంతా రెడీ చేస్తున్నారు. చిరు, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది.  రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఆల్బమ్‌ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ఇప్పటికే పెద్ద హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మూడవ సింగిల్ విడుదలవుతోంది.

నేడు, డిసెంబరు 26న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్‌ ను విడుదల చేయనున్నారు. ఈ రాకింగ్ ట్రాక్‌ తో డిఎస్పీ  పూనకాలు అందించనున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ చిరంజీవిని స్టైలిష్ అవతార్‌ లో ప్రజంట్ చేసింది. పోస్టర్‌ లో చేతిలో పోర్టబుల్ గ్యాస్ బర్నర్ పట్టుకుని కనిపించారు. షేడ్స్‌పై ఫైర్ ఫ్లేమ్స్ ప్రతిబింబాన్ని మనం గమనించవచ్చు.ఈ గెటప్, చిరంజీవి గ్యాస్ బర్నర్ పట్టుకుని చేసిన యాక్ట్ ‘గ్యాంగ్ లీడర్‌’ ను గుర్తు చేస్తుంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular