Wednesday, June 17, 2026
Homeసినిమాఅందాల శ్రీలీల హవా మొదలైనట్టే!

అందాల శ్రీలీల హవా మొదలైనట్టే!

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో శ్రీలీల ఒకరు. కృతి శెట్టి తరువాత కొత్తగా వచ్చిన కొంతమంది కథానాయికలలో శ్రీలీల మాత్రమే ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. గ్లామర్ పరంగాను .. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అయితే తన ఫస్టు సినిమాను టీనేజ్ హీరోతో చేసిన శ్రీలీల, రెండో సినిమాను ఏకంగా రవితేజ వంటి సీనియర్ స్టార్ హీరోతో చేయడానికి ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రవితేజ జోడీగా ఆమె సెట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే ‘ధమాకా’ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా రవితేజ సరసన శ్రీలీల చిన్నపిల్ల మాదిరిగా అనిపించలేదు. రవితేజ మాస్ స్టైల్ కి తగినట్టుగా ఒదిగిపోయింది. హుషారైన ఆయన స్టెప్పులను అంతే స్పీడ్ తో అందుకోగలిగింది. డాన్స్ లోను ఈ బ్యూటీ తన ఎనర్జీని ఒక రేంజ్ లో చూపించింది. ఈ సినిమా తరువాత శ్రీలీలకి అవకాశాలు పెరగడం ఖాయంగానే కనిపిస్తోంది. అంతలా ఈ అమ్మాయి తెరపై మేజిక్ చేసింది.

ఇప్పటికే ఈ సుందరి రామ్ – బోయపాటి కాంబినేషన్లో ఒక సినిమా చేస్తోంది. అలాగే నితిన్ వక్కంతం వంశీ కాంబినేషన్లోని సినిమా కూడా లైన్లోనే ఉంది. ఇక బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. బాలకృష్ణ కూతురిగా ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకం కానుంది.  తాజాగా త్రివిక్రమ్ – మహేశ్ బాబు ప్రాజెక్టులోను రెండో కథానాయికగా ఆమె పేరు వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే శ్రీలీల హవా మొదలైనట్టుగానే అనిపించడం లేదూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular